బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (19:06 IST)

ఆల్ ది బెస్ట్ అంటున్న నాగఅన్వేష్ అభిమానులు.. ఎందుకంటే?

ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు సినిమా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వెంకటేష్ నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్, ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ చేసే రొమాన్స్ బాగా క్లిక్ అయ్యింది. అయితే అందులో ఒక పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోతుంది. 

 
ఆ క్యారెక్టర్ వెంకటేష్ కుమారుడిగా నటించిన నాగ అన్వేష్. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా.. గట్టిగా డైలాగులు చెబుతూ వంటింట్లో పనిమనిషి తలలో ఎందుకు పువ్వులు పెట్టావు నాన్న అంటూ వెంకటేష్‌ను ఆటపట్టించడం.. లాంటివి సినిమాలోనే హైలెట్‌గా నిలుస్తుంటుంది. అందులో చిన్నపిల్లాడి క్యారెక్టర్ నాగ అన్వేష్ పోషించాడు. 

 
ప్రస్తుతం అతను హీరో కూడా అయ్యాడు. వినవయ్య రామయ్య సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఫర్వాలేదు అనిపించింది. అయితే సినిమా గురించి పక్కనబెడితే ప్రేమించిన యువతినే పెళ్ళి చేసుకోబోతున్నాడు నాగ అన్వేష్. ఆమె ఎవరో కాదు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కంపెనీ డైరెక్టర్ విజయ కుమార్ కుమార్తె. కావ్యను గత కొన్ని సంవత్సరాలుగా నాగ అన్వేష్ ప్రేమిస్తున్నాడు.

 
వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. దీంతో నాగఅన్వేష్ నిశ్చితార్థం ఎంతో ఆడంబరంగా జరిగింది. కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. చాలామంది నాగ అన్వేష్‌ను చిన్నప్పుడు సినిమాలో డైలాగులు చెప్పినట్లుగా మల్లె పువ్వు అంటూ ఆటపట్టించారట.