బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (20:47 IST)

గాయనితో మణిశర్మ తనయుడి వివాహం..

Manisharma son
మెలోడీ బ్రహ్మగా పిలవబడే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు, యువ సంగీత దర్శకుడు అయిన మహతి స్వరసాగర్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యారు. "ఛలో", "భీష్మ", "మాస్ట్రో" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి యువ సంగత దర్శకుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా మహతి తన ప్రతిభను చాటేశారు. మహతి స్వర సాగర్ నిశ్చితార్థం నిన్న గాయని సంజన కలమంజతో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి దగ్గర స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే విచ్చేశారు.
 
ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంజనా కలమంజే కూడా ప్రముఖ గాయని. తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలలో చాలానే పాటలు పాడారు. మూడు భాషల్లోనూ గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సంజన, సాగర్ సంగీతం అందించిన భీష్మ లో "హేయ్ చూసా" పాటను పాడింది. ఇక వీరిది ప్రేమ వివాహమా? కాదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగబోతుందని సమాచారం.