శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:30 IST)

40 దాటినా అందం తగ్గలేదే.. శ్రియ చీర ఫోటోలు వైరల్

Sreya
Sreya
టాలీవుడ్ టాప్ హీరోయిన్ నటి శ్రేయ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏజ్ 40 దాటిన ఈ భామ.. ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా అదే రేంజ్‌లో ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంది. తమిళం, తెలుగు, హిందీ సహా పలు భాషా చిత్రాల్లో శ్రియ నటించింది. 
 
అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడినా సినిమాలకు మాత్రం దూరం కాలేదు.
 
తాజాగా తన సోషల్ మీడియా పేజీలో చీర కట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూసిన చాలా మంది 40 ఏళ్ల వయసులో ఇంత అందంగా ఉన్నారా? ఇప్పటికీ మీ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్లు వస్తున్నాయి.