ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (15:56 IST)

ఆస్కార్‌ ఆనందంలో శ్రియ, ఉపేంద్ర డాన్స్‌ ఇరగదీశారు

Shriya and Upendra
Shriya and Upendra
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ రావడంపై పలువురు పలురకాలుగా స్పందించారు. ఇక అందులో నటించిన శ్రియాశరణ్‌ మరింత ఆనందం వ్యక్తంచేసింది. సోమవారంనాడు ఆమె నటించిన కబ్జా సినిమా ప్రమోషన్‌ హైదరాబాద్ లో జరిగింది. ఇందులో ఆమె పాల్గొంది. అదేవేదికపై వున్న ఉపేంద్ర కూడా మాట్లాడుతూ, గ్రేట్‌ దర్శకుడు రాజమౌళి, గ్రేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణిగారు ఆధ్వర్యంలో ఇండియాలోనే నాటునాటు సాంగ్‌ సెస్సేషనల్‌ చేశారు. ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చరణ్‌ ఇద్దరూ డాన్స్‌ చేస్తే ఇండియానే డాన్స్‌ చేసింది.

ఇప్పుడు ప్రపంచమే డాన్స్‌ చేస్తుంది. ఆస్కార్‌ దక్కింది. హిస్టరీక్రియేట్‌ చేసింది అంటూ.. ఆస్కార్‌ వచ్చిన సినిమాలో నటించిన శ్రియతో నేను కూడా కబ్జాలో నటించడం చాలా ఆనందంగా వుందంటూ సరదాగా మాట్లాడారు. వెంటనే ఇద్దరూ కలిసి ఆనందంలో ఇలా డాన్స్‌ చేసి అందరినీ అలరించారు.
 
పల్‌ పల్‌ పల్లీ. నా ఊరు బెల్లంపల్లి.. నా పేరు కోమలి.. అంటూ కబ్జా సినిమాలోని పాటకు డాన్స్‌ లేసి అలరించారు. ఈ సినిమాకు దర్శకుడు చంద్రు. మార్చి 17న సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది.