సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (16:18 IST)

సుత్తిలేకుండా.. సాగదీయకుండా చిత్రం తీశారు : కేశవ సినిమాపై కేసీఆర్, కవిత ప్రశంసలు

నిఖిల్ హీరోగా నటించిన చిత్రం కేశవ. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితలు ప్రత్యేక షోను తిలకించారు. సినిమా విడుదలైన శుక్రవారం రోజే కేసీఆర్, కవితలకు స్పె

నిఖిల్ హీరోగా నటించిన చిత్రం కేశవ. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితలు ప్రత్యేక షోను తిలకించారు. సినిమా విడుదలైన శుక్రవారం రోజే కేసీఆర్, కవితలకు స్పెషల్ షో వేశారని ఆ వర్గాలు అంటున్నాయి. సినిమా ఇద్దరికీ చాలా బాగా నచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
 
ఈ చిత్రంపై వారు స్పందిస్తూ.... స్టైలిష్‌గా, సాగదీయకుండా సుధీర్ వర్మ సినిమా తీసిన విధానాన్ని కేసీఆర్ మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. సాధారణ ప్రతీకార కథే అయినా.. డైరెక్టర్ సినిమా ప్రెజెంట్ చేసిన విధానం కేసీఆర్‌కు బాగా నచ్చినట్టు చెబుతున్నారు. గుండె కుడివైపున ఉండడం, దాని వల్ల ఇబ్బందులు ఎదురైనా.. హీరో తన ప్రతీకారం తీర్చుకున్న విధానం తెరపై సుధీర్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని కేసీఆర్, కవిత ప్రశంసించారట. 
 
కాగా, సీఎం కేసీఆర్, కవిత.. కేశవ సినిమా చూడటం పట్ల నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు. వారికి కృతజ్ఞతలు తెలిపాడు. కేశవ సినిమా కోసం టైం కేటాయించి, సినిమాను అభినందించిన గౌరవీనీయులైన సీఎం కేసీఆర్, ఎంపీ కవిత గార్లకు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.