గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (21:12 IST)

బరువెక్కుతున్న కేతిక శర్మ హృదయ అందాలు.. కుర్రాళ్లు ఫిదా!

Ketika Sharma
కుర్ర హీరోయిన్ కేతిక శర్మ హృదయ అందాలు రోజురోజుకూ బరువెక్కిపోతున్నాయి. ఈ అందచందాలతో కుర్రకారును కేరింతలు కొట్టిస్తుంది. గత 2021లో పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేశారు. తెలుగులో 'రొమాంటిక్', 'లక్ష్య', 'బ్రో', 'రంగరంగ వైభవంగా' అనే చిత్రాల్లో పేరున్న నటులకు జంటగానే చేసినప్పటికీ అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. 
 
పైగా, ఇప్పటివరకు తెలుగు తప్పా మరే భాషలోనూ సినిమాలు చేయని ఈ భామ.. హీరో అల్లు అర్జున్‌తో కిసి ఆహా యాడ్‌లో కనిపించి మెప్పించింది. అయితే, చాలా మంది ముంబై భామల కన్నా గ్లామర్, అందం పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఛాన్సులు రాకపోవడంపై ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు తలుపు తట్టడం లేదా, లేదా ఆమె కావాలని అంగీకరించడం లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, చేతిలో ఎలాంటి అవకాశాలు లేకపోయినప్పటికీ ఈ భామ మాత్రం నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. తరచుగా హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతుంది.