శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (13:56 IST)

'దిల్' రాజు పెద్ద ఈగోయిస్టా? ఆయన చిత్రానికి దర్శకత్వం వహిస్తే కెరీర్ నాశనమేనా?

నిర్మాత దిల్‌ రాజు దర్శకుని అవతారం ఎత్తాడు. ఎక్కువగా తను నిర్మాతగా ఉన్న సినిమాలకు కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ ఉంటాడు. ఆ దర్శకులకు తన చుట్టూ తిప్పుకుని.. కథంతా ఫైనల్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌ అయ్యాక.. ఇ

నిర్మాత దిల్‌ రాజు దర్శకుని అవతారం ఎత్తాడు. ఎక్కువగా తను నిర్మాతగా ఉన్న సినిమాలకు కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ ఉంటాడు. ఆ దర్శకులకు తన చుట్టూ తిప్పుకుని.. కథంతా ఫైనల్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌ అయ్యాక.. ఇక వారి అవసరం పెద్దగా ఉండదు. అప్పటికే దర్శకుడిగా తన పేరు ఇండస్ట్రీలో నిలవాలని కలలు కనే వర్థమాన దర్శకులను దిల్‌ రాజు ఇలా నీరుగారుస్తుంటాడు. 
 
విశ్వసనీయ సమాచారం మేరకు తను నిర్మాతగా ఉన్న అన్ని చిత్రాలకు తనే దర్శకుడిగా మారాడని తెలిసింది. పేరుకు మాత్రమే దర్శకుడు ఉంటాడు. అతను కూడా కో-డైరెక్టర్‌గా షూటింగ్‌ సమయంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా గుంపులను కంట్రోల్‌ చేయడం, ఆర్టిస్టులను పిలుసుకురావడం చేయాలి. ఇదీ షూటింగ్ స్పాట్‌లో దిల్‌ రాజు రూల్‌. అంతకుమించి ఒక్కడుగు కూడా దర్శకుడు ముందుకు వేయడానికి లేదు. 
 
'సీతమ్మవాకిట్లో సిరమల్లెచెట్టు' చిత్రీకరణ కూడా దర్శకుడు శ్రీకాంత్‌ ఇలానే చేయాల్సివచ్చినట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ చిత్ర యూనిట్‌ ఆయన సినిమాలకు పనిచేయాలంటే.. ముందుగా దిల్‌ రాజుకు నమస్కారం పెట్టాలి. దర్శకుడు పెట్టినా పెట్టకపోయినా పెద్దగా లాభంలేదు. స్వతహాగా ఈగోయిస్ట్‌ అయిన దిల్‌ రాజు.. సంక్రాంతినాడు విడుదలచేసిన 'శతమానం భవతి' చిత్ర దర్శకుడు సతీష్‌కు చుక్కలు చూపించినట్లు చిత్రయూనిట్‌ గుసగుసలాడుతోంది. 
 
సినిమా రిలీజ్‌ అయి.. తనకు పేరు వస్తుందనుకున్న దర్శకులకు ఆయన బేనర్‌లో పనిచేయడం పెద్ద పరీక్షగా మారుతుంది. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలనుకోవాలన్న దర్శకులకు దిల్‌ రాజు సినిమా చేయడం పెద్ద మైనస్‌గా మారిందని తెలుస్తోంది. ఇటీవలే ఆయన సినిమాలకు గత మూడు చిత్రాలకు పనిచేసిన దర్శకులకు ఇండస్ట్రీలో ఎక్కడా అవకాశాలు లేకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో ఒకటిరెండు చిత్రాలకు పనిచేస్తే ఇంకో నిర్మాత అవకాశం ఇస్తాడు. కానీ దిల్‌ రాజు సినిమాకు దర్శకుడిగా పనిచేస్తే.. ఆ దర్శకుడికి గండి పడిపట్టేనని... ఫిలింనగర్‌లో జోరుగా విన్పిస్తోంది.