1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 11 జులై 2016 (10:31 IST)

మహేష్ బాబు ట్వీట్‌కు ఆరేళ్ల తర్వాత రిప్లై ఇచ్చిన త్రిష!

మహేష్ బాబు వంటి స్టార్ హీరో కాంప్లిమెంట్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే. అలాంటిది ఆ అందగాడు కాంప్లిమెంట్స్ ఇస్తే లెక్కచేయలేదంట ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు సన్నజాజి తీగ త్రిష. అసలు విషయం ఏంటంటే మహేష్..

మహేష్ బాబు వంటి స్టార్ హీరో కాంప్లిమెంట్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే. అలాంటిది ఆ అందగాడు కాంప్లిమెంట్స్ ఇస్తే లెక్కచేయలేదంట ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు సన్నజాజి తీగ త్రిష. అసలు విషయం ఏంటంటే మహేష్... ఆరేళ్ల కింద మహేష్ ఇచ్చిన ఓ కాంప్లిమెంట్ను చెన్నై చిన్నది త్రిష... ఇన్నాళ్లకు చూసుకుందట. నమ్మడం కాస్త కష్టంగానే ఉన్నా.. త్రిష చేసిన తాజా ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆరేళ్ల క్రితం అంటే 2010 ఏప్రిల్ 27న తన ట్విట్టర్ పేజ్లో 'నాకు నచ్చిన కో స్టార్స్ త్రిష, అనుష్క' అంటూ మహేష్ పోస్ట్ చేశాడు. 
 
2010 సంవత్సరంలో మహేష్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా ఓ అభిమాని ట్విట్టర్‌లో మీకు ఇష్టమైన కో స్టార్ ఎవరని అడిగాడట. దానికి సమాధానంగా మహేష్ తనకు త్రిష, అనుష్క ఇష్టమైన కోస్టార్స్ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్కు ఇప్పుడు.. 2016 జూలై 8న రిప్లై ఇచ్చింది త్రిష. 'ఈ ట్విట్ నేను ఎలా మిస్ అయ్యాను' అంటూ కామెంట్ కూడా చేసింది. 
 
ఆ ట్వీట్ లేటెస్ట్‌గా త్రిష కంటపడింది, అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే త్రిష సూపర్ స్టార్ చేసిన ట్వీట్‌ని ఎలా మిస్ అయిందంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే అప్పట్లో త్రిష చూసుకోలేదా.. లేక ఇదంతా తన తాజా చిత్రం నాయకీ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇలా ట్వీట్ చేసిందా.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.