సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (14:42 IST)

ఆ క్యారెక్టరా.. అమ్మో నేను చేయనంటున్న కీర్తి సురేష్

వరుస ఫ్లాప్‌లతో ఆచితూచి అడుగులు వేస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. అగ్రహీరోలతో నటించినా ఫ్లాప్‌లు మాత్రం వస్తూనే ఉండటంతో ఆమె ఆలోచనలో పడిపోయింది. కథతో పాటు తనకు సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుని ఆ తరువాతే ఆ సినిమాలో చేయాలో లేదా అన్న నిర్ణయానికి వస్తోంది కీర్తి సురేష్.
 
తాజాగా ఆమెకు పోలీసు క్యారెక్టర్ ఇచ్చేందుకు దర్శకురాలు నందినీ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో హీరో రానా. అయితే పోలీస్ క్యారెక్టర్ తను చేయనని చెప్పేసిందట కీర్తి సురేష్. ఆ క్యారెక్టర్‌కు తను సరిపోనని.. అందులోను డ్రగ్స్ మాఫియా తరహాలో ఉన్న సినిమాలో నటించడం తన వల్ల కాదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసిందట. 
 
ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని.. ఆ సినిమాల్లో బిజీగా ఉన్నానని, ఇలాంటి క్యారెక్టర్లు చేయడం తనకు ఇష్టం లేదని చెబుతోంది. దర్సకురాలు నందినిరెడ్డితో అలా మాట్లాడటం, దాంతో పాటు రానా లాంటి అగ్ర హీరో ఉన్న సినిమాలో నటించనని కీర్తి సురేష్ చెప్పడం తెలుగు సినీపరిశ్రమలో చర్చకు దారితీస్తోంది.