శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:28 IST)

వామ్మో హీరో 'రానా'తోనా.. నా వల్ల కాదంటున్న హీరోయిన్?

అటు హీరోగా, ఇటు విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి. బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడు పాత్రలో జీవించాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. పైగా, ఆయనకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ వుంది. ఆ కారణంగానే ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. మరోవైపు సోలో హీరోగా నటిస్తున్నారు. 
 
అలాంటి హీరో సరసన నటించేందుకు మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ నిరాకరించింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న ఆమె, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.
 
ఈ నేపథ్యంలోనే రానా సినిమాలోనూ చేయడానికి 'నో' చెప్పేసిందట. రానా హీరోగా ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అట. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను తీసుకున్నది రానానే. 
 
ఆయన జోడీగా కీర్తి సురేశ్ ను సంప్రదించగా ఆమె 'నో' చెప్పేసిందట. దీనికి కారణం, ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది తెలియరాలేదు. దీంతో ఇప్పుడు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట.