శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (15:49 IST)

హీరో నాగార్జున గదిలో యంగ్ హీరోయిన్.. నాగ్ మోడ్రన్ మాంత్రికుడంటూ కితాబిచ్చింది...

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ అమ్మడు వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను అనుకుంది. కానీ, సందీప్ కిషన్

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ అమ్మడు వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను అనుకుంది. కానీ, సందీప్ కిషన్‌తో 'టైగర్' మూవీ మాత్రమే చేయగలిగింది. 
 
ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సీరత్‌కి ఆఫర్లు రాలేదు. దాంతో ముంబై వెళ్ళి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటోంది. అయితే సీరత్‌ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఉన్నట్టుండి తన గదిలోకి పిలిచాడు. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
నాగార్జున హీరోగా ఓంకార్ డైరెక్షన్‌లో 'రాజుగారి గది 2' రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 'ఊపిరి' సినిమా తర్వాత పివిపి నాగార్జునతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తోంది. నాగార్జున ఈ మూవీలో మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడట. ఈ మూవీలో హీరోయిన్‌గా సీరత్ కపూర్‌ని ఓకే చేసారని టాక్. 'టైగర్' ఫ్లాప్‌తో ఆఫర్లు లేక ముంబై వెళ్ళిపోయిన సీరత్‌కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ వంటిదే.