గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (11:47 IST)

కంగనా రనౌత్ చాలా బోల్డ్ పర్సన్ .. ఎలా ఉంటారోనని ఒకటే టెన్షన్ : రాఘవ లారెన్స్...

Kangana Ranaut, Raghava Lawrence
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం 'చంద్రముఖి 2'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించారు. సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ 'లైకా ప్రొడక్షన్స్' బ్యానరుపై నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. 'వినాయక చవితి' సందర్భంగా 'చంద్రముఖి 2' సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో లారెన్స్ మాట్లాడుతూ, "పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్ తనతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ 'చంద్రముఖి 2' వంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానరులో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇక మా డైరెక్టర్ వాసు గురించి చెప్పాలంటే ఆయనతో తనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. 'చంద్రముఖి 2'ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది'' అని అన్నారు. 
 
''కంగనా రనౌత్ ఈ సినిమాలో నటిస్తారని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆమె చాలా బోల్డ్ పర్సన్. ఆమె ఎలా ఉంటారోనని టెన్షన్ పడ్డాను. ఆమె సెట్‌లోకి గన్‌మెన్లతో వచ్చేవారు. అప్పుడు తనలో ఇంకా భయం పెరిగిపోయింది. తర్వాత నా వినతి మేరకు ఆమె గన్‌మెన్స్‌ను సెట్ బయటే ఉంచారు. అప్పటి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్రలో లీనమై నటించారని అన్నారు.
 
ఇక సంగీత దర్శకుడు కీరవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వర్క్స్‌ను టెన్షన్‌లా ఫీలై చేయరు. ఈ సినిమాతో నాకు ఆవిషయం అర్థమైంది. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టే అంత మంచి సంగీతాన్ని మా సినిమాకు అందించారు. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, ఎడిటర్ ఆంటోని సహా ఎంటైర్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో 'చంద్రముఖి 2' వంటి గొప్ప సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది" అన్నారు.