శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (20:39 IST)

ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాల ఆహ్వానాన్ని అందుకున్న "మా"

అలనాటి విశ్వనాథ చక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జులై 2018న ఆయన స్వస్థలం అయిన ఏలూరులో ఎంఎల్ఏ బడేటి కోట రామారావు (బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అలనాటి విశ్వనాథ చక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జులై 2018న ఆయన స్వస్థలం అయిన ఏలూరులో ఎంఎల్ఏ బడేటి కోట రామారావు (బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏలూరు ఎంఎల్ఏ బడేటి బుజ్జి, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ అంబికా కృష్ణలు మా అసోసియేషన్ సభ్యులను ఆహ్వానించడానికి శనివారం ఉదయం 'మా' కార్యాలయానికి  విచ్చేసారు. ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వీకరించిన 'మా' అసోసియేషన్ సభ్యులు 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, పరచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ, నాగినీడు, సంతోషం పత్రికా అధినేత, నిర్మాత సురేష్ కొండేటిలు ఎంఎల్ఏ బడేటి బుజ్జిని, అంబికాకృష్ణని గౌరవపూర్వకంగా సన్మానించారు.