సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (11:23 IST)

అర్థ సెంచరీ కొట్టిన 'రంగస్థలం'.. ఖుషీలో మిస్టర్ 'సి'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై అర్థ సెంచరీ కొట్టింది. అంటే యాభై రోజులు పూర్తి చేసుకుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై అర్థ సెంచరీ కొట్టింది. అంటే యాభై రోజులు పూర్తి చేసుకుంది. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం... తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను వసూళ్ల పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్‌ను ఈ సినిమా మరో మెట్టుపైన నుంచో బెట్టింది.
 
అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో సందడి చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత 'భరత్ అనే నేను' .. 'నా పేరు సూర్య' వంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినా, అవి 'రంగస్థలం' సినిమా వసూళ్లపై చూపించిన ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. 
 
వసూళ్ల పరంగా.. నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, రూ.120 కోట్లకి పైగా షేర్‌ను రాబట్టింది. కథ.. కథనాలు.. సంగీత సాహిత్యాలు.. చిత్రీకరణ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచి, ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ చిత్రాన్ని చూసిన అనేక ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెల్సిందే.