గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (12:27 IST)

2024 జనవరి 3న అమీర్ ఖాన్ కుమార్తె పెళ్లి..

Aamir Khan-daughter
Aamir Khan-daughter
2024 జనవరి 3న కుమార్తె వివాహం జరగనున్నట్టు బాలీవుడ్ అమీర్ ఖాన్ ప్రకటించారు. కుమార్తె ఇరా జనవరి 3న వివాహం చేసుకోబోతోంది. అతడి పేరు నుపుర్. అతడో లవ్ లీ బోయ్. ఇరా మానసికంగా కుంగుబాటు చెందుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచాడు."అంటూ చెప్పారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. 
 
ఇక అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తా తనయ ఇరా ఖాన్ నిశ్చితార్థం 2022 నవంబర్ 18న జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో కాలం నుంచి ఆమె ప్రేమిస్తున్న నుపుర్ శిఖర్‌కు తన కుమార్తె ఇరానిచ్చి పెళ్లి చేయాలని అమీర్ ఖాన్ నిర్ణయించుకున్నారు. దీంతో అమీర్ ఇంట త్వరలో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.