బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (14:53 IST)

ఫరియా అబ్దుల్లా వెంట పడుతున్న అల్లరి నరేష్ టీజర్ రాబోతుంది

allarinaresh - fariaabdullah
allarinaresh - fariaabdullah
అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తున్న చిత్రం ఆ ఒక్కటీ అడక్కు.  డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం టీజర్ రేపు విడుదలకాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. పెండ్లి బట్టలతో వున్న నరేష్ తాళి బొట్టు తీసుకుని ఫరియా వెంట వెబుతున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీని గురించి తెలియాలంటే టీజర్ చూస్తే అర్థమవుతుందని చెబుతున్నారు.
 
గతంలో ఇదే టైటిల్ తో రాజేంద్రప్రసాద్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ తరహాలో ఆద్యంతం వినోదాత్మకంగావుండేలా దర్శకుడు చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.  ఈ చిత్రం మార్చి 22, 2024న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం  కొత్త విడుదల తేదీ తెలియజేయాల్సి వుంది.