ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (16:52 IST)

హిందీ బిగ్ బాస్‌లో విజేతగా టీవీ నటి రుబీనా.. విడాకులైనా భర్తతో కలిసి..?

Rubina
తెలుగు బిగ్‌బాస్‌ షో నాలుగుసార్లు జరిగితే ఒక్కసారి కూడా స్త్రీలు విజేతగా నిలువలేదు. కాని బిగ్‌బాస్‌ హిందీ షో 14 సీజన్‌లు గడిస్తే ఇప్పటికి ఐదారుసార్లు స్త్రీలు విజేతలుగా నిలిచారు. తాజాగా బిగ్‌బాస్‌ 14 విజేతగా టీవీ నటి రుబీనా దిలైక్‌ నిలిచింది. పేరు, గుర్తింపుతో పాటు ప్రైజ్‌మనీగా 36 లక్షల రూపాయలు ఆమెకు దక్కాయి. అయితే అదంత సులువుగా జరగలేదు.
 
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హిందీ రియాల్టీ షో విన్నర్‌గా నిలిచిన టీవీ నటి రుబీనా దిలైక్‌ తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట చర్చ మొదలైంది. విజేతగా వచ్చే కీర్తితో పాటు ఇదే షోలో పాల్గొన్న భర్త అభినవ్‌ శుక్లాతో తన వివాహబంధం గట్టిపడిందని చెబుతోంది. ‘విడాకులు తీసుకోవాల్సిన మేము ఈ షో వల్ల ఒకరినొకరం అర్థం చేసుకున్నాం’ అందామె. 33 ఏళ్ల ఈ సిమ్లా సెలబ్రిటీ చెప్పుకొచ్చింది. 
 
143 రోజులు హౌస్‌లో వుండిన ఈమె.. ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె ప్రతి ఒక్కరితో వాదనకు దిగేది. సల్మాన్‌ ఖాన్‌కు కూడా ఇలా చేయడం నచ్చలేదు. ‘ఈ సరంజామా తీసుకునా నువ్వు వచ్చింది’ అని అతను షోలో కామెంట్‌ చేయడంతో రుబీనా బాగా హర్ట్‌ అయ్యింది. కానీ రుబీనాకు కొద్దిరోజుల్లోనే హౌస్‌లో బయట అభిమానులు ఏర్పడ్డారు. బయట రుబీనా అభిమానులు తమని తాము ‘రుబీహాలిక్స్‌’ అని పేరు పెట్టుకుని సపోర్ట్‌గా నిలిచారు. టాస్క్‌ల్లో రుబీనా పోరాట పటిమ కూడా అందరికీ నచ్చింది.
 
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లాక్‌డౌన్‌ అందరి జీవితాల్లో ఎలా సంక్షోభం తెచ్చిందో రుబీనా జీవితంలో కూడా అలాంటి సంక్షోభమే తెచ్చింది. ఆమె టీవీ నటుడు అభినవ్‌ శుక్లాను ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. కాని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి వాదనలు నడిచేవో ఇంటిలో కూడా అలాంటి వాదనలే నడిచేవి. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఇద్దరూ ఉండేసరికి గొడవలు శ్రుతి మించాయి. 
 
దీంతో విడాకులు తీసుకున్నారు. అనుకోకుండా ఇద్దరికీ కలిపి బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రవేశం దొరికింది. బయటవారికి ఈ సమాచారం లేనందున ఇరువురూ అన్యోన్య దంపతుల ఖాతాలో హౌస్‌లో అడుగుపెట్టారని అనుకున్నారు. కాని షో కొనసాగే కొద్ది వారి మధ్య ఉన్న స్పర్థలు ప్రేక్షకులకు తెలిశాయి.
 
ఆ తర్వాత వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా కనిపించింది. చాలా సందర్భాలలో ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలిచారు. సల్మాన్‌ ఖాన్‌ తో రుబీనాకు గొడవ వచ్చినప్పుడు భర్త అభినవ్‌ ఆమెకు సర్ది చెప్పాడు. అంతేకాదు షోలో జరిగే ‘బెస్ట్‌ జోడీ’ కాంపిటీషన్‌లో ఈ భార్యాభర్తలే బెస్ట్‌గా నిలిచారు. ‘బిగ్‌బాస్‌ హౌస్‌కు కృతజ్ఞతలు. ఈ హౌస్‌లో ఉండటం వల్లే మేము ఒకరికి ఒకరం అర్థమయ్యాం. మా చేదు తగ్గింది. మేము కలిసి జీవించాలనుకుంటున్నాం’ అని షో ముగిశాక ఇద్దరూ వెల్లడించారు.