సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:08 IST)

సినీయర్ నటుడు రాఘవయ్య కన్నుమూత... భరత్ అనే నేనులో?

కథానాయకుడు, యమగోల, వీరాంజనేయ వంటి సినిమాల్లో నటించిన టాలీవుడ్ సీనియర్ నటుడు రాఘవయ్య (86) మృతి చెందారు. ఈయన సినీ నటుడు బెనర్జీకి రాఘవయ్య తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రాఘవయ్య ఆదివారం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం రాఘవయ్య భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్‌లోని వారి స్వగృహంలో ఉంచారు. 
 
ఆదివారం మహాప్రస్థానంలో రాఘవయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాఘవయ్య మృతిపై టాలీవుడ్ ప్రముఖులు పలువురు తమ సంతాపం తెలిపారు. కాగా, టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పలువురు సీనియర్ నటులతో కలిసి పనిచేసిన రాఘవయ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
 
దాదాపు 50 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి సేవలందించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారని.. చివరి నిమిషం వరకు యాక్టివ్‌గా వున్న రాఘవయ్య.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ''భరత్ అనే నేను'' సినిమాలో నటించారు.