గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:02 IST)

సీఎం జగన్ సర్.. అందరికీ వరాలు ఇస్తున్నారు.. మాకు ఇవ్వరా? బ్రహ్మాజీ ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న వరాలపై సినీ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. "సీఎం జగన్ సర్... అందరికీ వరాలు ఇస్తారు. పాపం థియేటర్ల యజమానులకు, సినిమా వాళ్లకు కూడా చేయండి. ఇట్లు మీ నాన్నగారి అభిమాని" అంటూ చమత్కారంగా, ఆసక్తికరంగా ఆయన ట్వీట్ చేశారు. 
 
ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హీరోలు, మంత్రుల మధ్య ఏపీలో టిక్కెట్ల వార్ సాగుతోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫోటోలను బ్రహ్మాదీ ఈ సందర్భంగా రీట్వీట్ చేశారు. 
 
తెలంగాణాలో కారు పార్కింగ్ ధర రూ.30 ఉందనీ ఏపీలో మాత్రం బాల్కనీ టిక్కెట్ ధర రూ.20, ఫస్ట్ క్లాస్ ధర రూ.15, సెకండ్ క్లాస్ ధర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫోటోలనే బ్రహ్మాజీ పోస్ట్ చేస్తూ, సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.