గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (16:35 IST)

రోడ్డు ప్రమాదం: నవీన్ పోలిశెట్టికి చేయి విరిగిందా?

Naveen Polishetty
హీరో నవీన్ పోలిశెట్టి అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగి రెండు రోజుల కూడా అయిపోయిందట. ఈ విషయం ఇక్కడి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. దీంతో నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 
 
రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ పోలిశెట్టికి ఒక చేయి విరిగినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. అమెరికాలో బైక్ యాక్సిడెంట్‌కు గురైన నవీన్ పోలిశెట్టికి వైద్యం చేసిన డాక్టర్లు అతడిని దాదాపు రెండు నెలలకు పైగానే విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. 
 
మరో మూడు నెలల వరకూ నవీన్ పోలిశెట్టి షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం ఉండదనే చెప్పాలి. అలాగే, బాలీవుడ్ రామాయణానికి కూడా ఎంపిక అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.