సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (15:55 IST)

సిద్ధుతో వైవాహిక జీవితంలో ప్రవేశించానని ప్రకటించిన అదితిరావ్ హైదరీ

Aditi Rao Hydari, hero Sidhu
Aditi Rao Hydari, hero Sidhu
కొద్దిరోజులుగా నటి అదితిరావ్ హైదరీ.. హీరో సిద్దార్థ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిన్న ఆల్ రెడీ వైవాహిక జీవితంలో అడుగుపెట్టారని ఇందుకు వనపర్తిలోని శ్రీ రంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యలు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగిందని వార్తలు ప్రచారం అయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.
 
కాగా, గురువారంనాడు తమకు పెళ్లి అయినట్లుగా ఉంగరాలు మార్చుకున్నట్లు ఫొటో ను ఇన్స్ట్రాలో ఇద్దరూ విడుదల చేశారు. అదితిరావ్ .. తాము ఎంగేజ్డ్.. అంటూ చిన్న కొటేషన్ పెట్టింది. ఇందుకు ఆమె ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాసముద్రం సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అదితిరావ్ వనపర్తి సంస్థానాదీశుల చివరి రాజా  రామేశ్వరరావుకు మనువరాలు కావడం విశేషం.