గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (12:20 IST)

బ్యాగులు మాయం.. థాయ్ ఎయిర్‌వేస్‌పై నజ్రియా ఫైర్

Nazriya Nazim,
హీరోయిన్ నజ్రియా హీరో ఫాహద్ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన నజ్రియా ఆ తరువాత నాలుగేళ్లకు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలెట్టింది. 
 
ఇక అంటే సుందరానికి సినిమాలో నటించిన విషయం తెలిసింది. కాగా నజ్రియా నజీమ్‌‌కు ఇది మొదటి తెలుగు సినిమా. ఇకపోతే నజ్రియా ప్రస్తుతం బోలెడు ఆఫర్లతో దూసుకుపోతుంది. 
 
ఈ క్రమంలోని ఒక షూటింగ్ కోసం ఆమె థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కగా అందులో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. థాయ్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. దీంతో సదరు ఎయిర్‌వేస్‌పై మండిపడింది. ఈ క్రమంలోని తాజాగా తన ఇన్‌స్టాలో ఒక స్టోరీని రాసుకొచ్చింది నజ్రియా. 
 
థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఓ చెత్త అంటూ కామెంట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఎయిర్‌ వేస్‌తో కానీ, సిబ్బందితో కానీ ఇంత భయంకరమైన అనుభవాన్ని పొందలేదు.. బ్యాగులు పోయాయి. సహాయం కోసం వెళితే ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయింది. జీవితంలో ఇక థాయ్ ఎయిర్‌వేస్ జోలికి వెళ్లనని తేల్చేసింది.