ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (18:27 IST)

యూ ట్యూబ్‌లో రామ్ సెన్సేష‌న్... ఏం చేసాడు..?

టాలీవుడ్లో ఎనర్జిటిక్ హీరో అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు రామ్. ఇటీవ‌ల‌ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించిన విష‌యం తెలిసిందే. పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ ఊహించని విధంగా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుంది. 
 
ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో పూరి నెక్ట్స్ మూవీని విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్లాన్ చేస్తుంటే... రామ్ ప్ర‌స్తుతం క‌థ‌లు వింటూ బిజీగా ఉన్నారు.
 
ఇదిలా ఉంటే... రామ్ నటించిన మూడు సినిమాలు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి అద్భుతమైన రికార్డుని సొంతం చేసుకున్నాయి. ఇంత‌కీ ఆ మూడు సినిమాలు ఏంటంటారా..? రామ్ నటించిన నేను శైలజ సినిమా హిందీలో సూపర్ ఖిలాడీ 3 టైటిల్‌తో డ‌బ్ అవ్వ‌గా, హలో గురు ప్రేమ కోసమే మూవీ దందార్ ఖిలాడీ టైటిల్‌తో, ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ నెంబర్ 1 దిల్వాలా టైటిల్‌తో ఇటీవల హిందీలో డబ్ అయ్యాయి.
 
నెంబర్ 1 దిల్వాలా కూడా 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా, మొత్తం ఈ మూడు సినిమాలతో 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించిన హీరోగా రామ్ సరికొత్త రికార్డుని నెలకొల్పారు. కాగా ఈ రికార్డు తమ హీరోకు దక్కడంతో ప్రస్తుతం రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు. సో... రామ్ మూవీకి నార్త్ లో బాగానే డిమాండ్ ఉన్న‌ద‌న్న మాట‌.