సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (16:02 IST)

షాకింగ్ న్యూస్- యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోనా పాజిటివ్..

Aishwarya Arjun
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ప్రముఖ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ మెసేజ్‌ను పొందుపరిచారు.
 
గడిచిన కొద్ది రోజుల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఐశ్వర్య సూచించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని.. మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానన్నారు. 
 
ఇటీవలే కన్నడ సినీ పరిశ్రమలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో అర్జున్ మేనల్లుడు, దివంగత నటుడు చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అదే ఫ్యామిలీ నుంచి అర్జున్ కుమార్తె కరోనా బారిన పడ్డారు. ఆమె త్వరలో కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.