మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 జులై 2017 (15:57 IST)

గట్స్ వున్న హీరోయిన్... గుండు కొట్టించుకుంది... ఎందుకో తెలుసా?

హీరోలు, హీరోయిన్లు గుండు కొట్టించుకోవడం అంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. దేవుడి మొక్కులను తీర్చుకునేందుకు తల నీలాలు సమర్పించుకోవడం అంటే వేరే సంగతి. కానీ సినిమా కోసం గుండు కొట్టించుకోవడం అంటే చాలా తక్కువమంది చేస్తుంటారు. ఈ కోవలో శరత్ కుమార్, చరణ్ రాజ్

హీరోలు, హీరోయిన్లు గుండు కొట్టించుకోవడం అంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. దేవుడి మొక్కులను తీర్చుకునేందుకు తల నీలాలు సమర్పించుకోవడం అంటే వేరే సంగతి. కానీ సినిమా కోసం గుండు కొట్టించుకోవడం అంటే చాలా తక్కువమంది చేస్తుంటారు. ఈ కోవలో శరత్ కుమార్, చరణ్ రాజ్ హీరోలు తమళంలో గుండు కొట్టించుకుని నటించారు. చరణ్ రాజ్ అయితే తను పట్టుకోవాల్సిన వాడు దొరకలేదని కసిగా గుండు కొట్టించుకునే సన్నివేశాన్ని షూట్ చేశారు. 
 
ఐతే హీరోయిన్ల విషయానికి వస్తే... గుండు కొట్టించుకుని నటించాల్సిన సన్నివేశాలు వస్తే చాలామటుకు విగ్గులు పెట్టుకుని నటించేస్తుంటారు. కానీ నటి పూర్ణ ఇందుకు భిన్నం. ఆమె తమిళ చిత్రం కోసం గుండు కొట్టించుకుని నటిస్తోంది. తమిళ దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్ హీరోగా నటిస్తున్న కొడివీరన్ అనే చిత్రంలో ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తోంది. 
 
ఐతే పాత్ర రీత్యా గుండులో కనిపించాల్సి వుండగా, దర్శకుడు విగ్గు పెట్టుకుని నటించమని సూచించాడట. కానీ సహజత్వానికి దగ్గరగా వుండాలని పూర్ణ గుండు కొట్టించుకుని నటించేందుకు సిద్ధమైందట. ఆమె కమిట్మెంట్ చూసి యూనిట్ అభినందనలతో ముంచెత్తుతున్నారట.