వణికిపోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. డ్రగ్స్ కేసులో పలువురి పేర్లు వెల్లడి?
కన్నడ చిత్ర పరిశ్రమను మాదకద్రవ్యాల వినియోగం కేసు వణికిస్తోంది. ఈ కేసులో శాండిల్‌వుడ్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్లు అయిన రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా రాగిణిని అరెస్టు చేసి జైలుకు పంపగా, ఆతర్వాత సంజనాను అరెస్టు చేశారు.
ఈమె వద్ద సీసీబీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీబీ పోలీసులు వేసే ప్రశ్నలకు సంజన సమాధానాలు చెప్పలేకు వెక్కి వెక్కి ఏడుస్తోందట. అంతేకాకుండా, ఈమె పలువురి పేర్లను లీక్ చేసినట్టు సమాచారం. దీంతో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు భయపడిపోతున్నారట.
సంజన అరెస్టుకు ముందు.. ఆమె సన్నిహితుడు, రియల్‌ఎస్టేట్ వ్యాపారి రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని కాల్‌డేటాను పరిశీలించగా, సంజనా పేరు బయటపడింది. అలాగే, మరికొందరి పేర్లు బయటపడటంతో వారందరికీ సీసీబీ నోటీసులు పంపించారు.
ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు.