శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (18:14 IST)

హీరోల నుంచి చాలాచాలా విషయాలు నేర్చుకుంటున్నా : శ్రీలీల

sree leela
తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత బీజీగా ఉన్న కుర్రకారు హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించేందుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ తనకు సినిమాలన్నా.. నటనన్నా ఎంతో ఇష్టం. అందువల్లే ఒకేసారి అన్ని ప్రాజెక్టుల్లో నటించడం అనేది కష్టంగా అనిపించడం లేదు. 
 
మొదటి నుంచి కూడా తనకు మంచి బ్యానర్లు, మంచి కథలు, పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను పని చేస్తున్న వెళుతున్న ప్రతి హీరో నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో అవకాశాల గురించి ఆలోచన చేయడం లేదు. అందుకు చాలా సమయం తీసుకోవచ్చు. పైగా, అవి మన చేతుల్లో లేవు. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి సినిమాలు చేశానని సంతృప్తి కలగాలి. అలాంటి సినిమాలు చేసుకుంటా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తాను అని చెప్పారు.