సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 8 జనవరి 2023 (10:07 IST)

రవితేజ నాలో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని నింపారు : శ్రీలీల

Sreeleela
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. "రవితేజ నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా కెరీర్ బిగినింగ్‌లో ఆయనతో పని చేసే అవకాశం రావడం, ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా ఆనందంగా వుంది. రవితేజ నాలో గొప్ప ఆత్మ విశ్వాసం నింపారు. రవితేజ గొప్ప స్ఫూర్తి. ధమాకాని మాస్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు. 
 
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌‌టైనర్ ''ధమాకా'. హీరోయిన్ శ్రీలీల నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. 
 
డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధమాకా' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ధమాకా 101 CR మాసివ్ సెలబ్రేషన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. 
 
ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదగా చిత్ర యూనిట్‌కు మెమెంటోలను ప్రదానం కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో శ్రీలీల మాట్లాడుతూ, నా సినిమా కెరీర్‌ ఆరంభంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారని, హీరో రవితేజకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు.