శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మే 2016 (11:21 IST)

మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంటోన్న కళ్యాణ్ రామ్ హీరోయిన్!

మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఏడాదికే తెరంగేట్రం చేయనున్న అదితి ఆర్య టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అంటే పడిచస్తోంది. పూరీ జగన్నాథ్ సినిమాతో అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో.. అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఆర్య మాట్లాడుతూ.. టాలీవుడ్ అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటని చెప్పింది. తాను తెలుగు సినిమాల్నే ఎక్కువగా చూస్తానని చెప్పింది. తన ఫేవరేట్ హీరో మహేష్ బాబు అంటూ అదితి వెల్లడించింది.  
 
కళ్యాణ్ రామ్-పూరీ కాంబినేషన్‌లో చేసే సినిమా చేసే ఆఫర్.. తను మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని అందుకోకముందే వచ్చిందని అసలు విషయాన్ని అదితి బయటపెట్టింది. అందాల పోటీ జరుగుతున్న నాడు కూడా స్టేజ్ వెనక తెలుగు స్క్రిప్ట్‌ను ప్రాక్టీస్ చేసినట్సు అదితి చెప్పింది. పూరీ సినిమాతో తెరంగేట్రం చేస్తుండటంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది.