శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (10:13 IST)

నాన్నగారిని ఎంజీఎం సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తర్వాత ఆయనకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలు మృతి వెనుక పెద్ద కుట్ర జరిగిందని, మనీ కోసం ఆయనని చాలా వేధించారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయం బాలు కుమారుడు చరణ్ దృష్టికి రాగా, ఆయన ఓ వీడియో ద్వారా పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
 
"ఆస్పత్రిలో నాన్నగారి చికిత్సకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని చెప్పారు. హాస్పిటల్ బిల్లు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం సిబ్బంది నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రార్ధనలు కూడా చేశారు. దయ చేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. నాన్న గారిని అభిమానించే వాళ్ళు ఇలా చేయకూడదు. ఈ సమయంలో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా బాధపెడతాయి. దయచేసి గమనించండి'' అని చరణ్ పేర్కొన్నారు.
 
మరోవైపు బాలుకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 25న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.