గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:40 IST)

ఆసక్తికరంగా అజయ్ ఘోష్, చాందినీ చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తి లుక్

Ajay Ghosh, Chandni Chaudhary music shop first look
Ajay Ghosh, Chandni Chaudhary music shop first look
ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద.. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. ఇక చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా పోస్టర్ ఉంది.
 
ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందించారు. శ్రీనివాస్ బెజుగమ్ కెమెరామెన్‌గా పని చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్లు ప్రకటించనున్నారు.