శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (19:16 IST)

నందమూరి బాలకృష్ణ తాజా సినిమాలో చాందిని చౌదరి

Chandni Chaudhary at 109 movie set
Chandni Chaudhary at 109 movie set
నందమూరి బాలకృష్ణ తన తాజా సినిమా 109వ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు  కనుక 109వ మూవీలో మరింత ప్రత్యేకతలు వుండాలని దర్శకుడు బాబీకి సూచించారు. అందుకు తగిన కథను ఆయన సిద్ధం చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.  థమన్ సంగీతం అందిస్తున్నారు.
 
కాగా, నేడు కలర్ ఫోటో మూవీ ఫేమ్ చాందిని చౌదరి ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె కీలక పాత్ర చేస్తున్నారు. షూటింగ్ విరామ సమయంలో డైరెక్టర్ తో కలిసి దిగిన పిక్ ని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు. త్వరలో మరింత అప్ డేట్ తో మీ ముందుకు వస్తానని తెలియజేసింది.