శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (14:26 IST)

కేజీఎఫ్ దర్శకుడితో అకీరానందన్ సినీ ఎంట్రీ.. పవన్ పక్కా ప్లాన్!?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అకీరానందన్‌ను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి తీసుకు వస్తారు అంటూ మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయం కావడంతో ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కొడుకును కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో పవర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.  
 
ఇక అకీరా ఇప్పటికే డాన్స్ లోనూ , సంగీతంలోనూ శిక్షణ కూడా పొందాడు. చదువు పూర్తయిన వెంటనే నటన లో శిక్షణ పొందడానికి అమెరికాకు వెళ్తున్నట్లు దగ్గరుండి పవన్ కళ్యాణ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
 
అకీరానందన్ మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని అడుగుపెట్టబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో పవన్ కుమారుడు కేజీఎఫ్ డైరక్టర్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడన్నమాట.