ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (21:57 IST)

విష్ణు మంచు 'మోస‌గాళ్లు' కోసం రంగంలోకి దిగనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

ఇంత‌కుముందు టైటిల్‌కీ థీమ్ మ్యూజిక్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా, దానికి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్యామ్ సీఎస్ ప‌నిత‌నానికి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇప్పుడు 'మోస‌గాళ్లు' చేసిన స్కామ్ ఏ స్థాయిదో బ‌య‌ట‌పెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. 
 
అక్టోబ‌ర్ 3న‌ ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను నిర్మాత‌లు విల‌క్ష‌ణంగా, విస్తృతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు.
 
భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా 'మోస‌గాళ్లు' చిత్రం రూపొందుతోంది. విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.
 
విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఈ చిత్రంలోని విశేషం. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రుహీ సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ, నిర్మాత‌: విష్ణు మంచు, ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌. విష్ణు సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ సినిమా అయినా ఆశించిన విజయం అందిస్తుందో లేదో చూడాలి.