గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (11:07 IST)

న్యూడ్ ఫోటోలతో మైండ్ బ్లాక్ చేసిన విష్ణు విశాల్.. ఆ క్రెడిట్ అంతా భార్యదేనట!

Vishnu vishal
Vishnu vishal
విష్ణు విశాల్ తన న్యూడ్ ఫోటోలతో నెటిజన్లవు మైండ్‌ బ్లాక్ చేశారు. ఎట్ ప్రజెంట్ కోలీవుడ్‌లో వర్సటైల్‌ సినిమాలు చేస్తూ.. మంచి పేరు కమాయిస్తున్న ఈ హీరో.. ఇటీవల మన హైదరాబాదీ, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు.
 
అటు ఫిల్మ్ కెరీర్‌లోనూ..ఇటు మ్యారీడ్‌ లైఫ్‌లోనూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ హీరో ఉన్నట్టుండి న్యూడ్ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని అనుకున్నారు. అనుకోవడమే కాదు.. ట్రెండ్‌లో జాయిన్ అయ్యాం! అనే అర్ధం వచ్చేలా క్యాప్షన్‌తో న్యూడ్‌ పిక్స్‌‌ను తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్ చేశారు. 
 
షేర్ చేయడమేకాదు.. తన ఫైఫ్ గుత్తా జ్వాల ఈ న్యూడ్‌ ఫోటోలను క్లిక్ చేశారని చెబుతూ అందర్నీ షాక్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.