గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (13:09 IST)

ఉపాసన కొణిదెల పుట్టినరోజు... ఉపాసన ప్రత్యేకత అదే..

Upasana
Upasana
ఉపాసన కొణిదెల పుట్టినరోజు. మెగా కోడలుగా.. రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 20 జూలై, 1989లో జన్మించిన ఉపాసన.. తండ్రి అనిల్ కామినేని, తల్లి శోభనా కామినేని. అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడం ఉపాసన ప్రత్యేకత. హెల్త్ విషయంలో తనకు తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మామూలు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
 
రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిచింది. ఉపాసన పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా ప్రేమిస్తోంది. ఉపాసన తన ఫామ్ హౌస్‌లో కుక్కలు, పిల్లులు, గుర్రాలను ఎన్నో పెంచుకుంటున్నారు. 
 
నిరుద్యోగులకు తన అపోలో హెల్త్ గ్రూప్‌‌లో ఏమైనా ఖాళీలు ఉంటే అప్లై చేసుకోమంటూ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ బిజీగా ఉంటుంది ఉపాసన. ఆ మధ్య రైతు అవతారం ఎత్తి తన ఫామ్‌హౌస్‌లో సేంద్రియా వ్యవసాయం చేస్తూ వార్తల్లో నిలిచింది.
 
మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేనికి ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అతను పుట్టినరోజు అమ్మాయితో ఒక అద్భుతమైన అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. 

"ఉపాసనా కామినేని, మీరు అవసరంలో ఉన్న వ్యక్తులను, కుటుంబ సభ్యులను ఆదరించడంలో బెస్టీ. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏ బహుమతి సరిపోదు! పుట్టినరోజు శుభాకాంక్షలు." అని తెలిపారు.