శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:53 IST)

అఖిల్ కాలిపై గిల్లాడు.. హీరోయిన్ల భవిష్యత్‌పై నాకు ఆందోళనగా ఉంది: ఆర్జీవీ

RGV
సంచలన దర్శకుడు ఆర్జీవి నిత్యం వివాదాలతోనే హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వ్యంగాస్త్రాలు కూడా విసురుతుంటారు. పవన్ కళ్యాణ్‌, చిరంజీవి, రామ్ చరణ్‌, బాలకృష్ణ వంటి స్టార్స్‌పై ఇప్పటికే వ్యంగాస్త్రాలు విసిరిన ఆర్జీవి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ హీరో అఖిల్‌ను టార్గెట్ చేశారు.
 
ఓ మూవీ ఈవెంట్‌లో పక్కపక్కన కూర్చున్న ఎన్టీఆర్‌, అఖిల్‌లు సరదాగా ఆటపట్టించుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. అఖిల్ కాలిపై గిల్లాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ దీనిని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్జీవి.. హీరోయిన్ల భవిష్యత్‌పై నాకు ఆందోళనగా ఉంది. సో శాడ్ అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.