మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:52 IST)

ఆర్జీవీ దెయ్యం.. మేకప్ లేకుండా రాజశేఖర్.. యాంగ్రీ మ్యాన్ కూతురిగా స్వాతి దీక్షిత్!

Deyyam
1996లో రామ్ గోపాల్ వర్మ జయసుధ, జెడీ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా 'దెయ్యం' సినిమాను తీశాడు. కమర్షియల్‌గా అది పెద్దంత ఆడలేదు. అయితే... ఆ తర్వాత కూడా ఇటు తెలుగులో, అటు హిందీలో ఇదే తరహాలో దెయ్యం సినిమాలను చాలానే తీశాడు రామ్ గోపాల్ వర్మ. తనకిష్టమైన ఈ హారర్ జానర్ లోనే కొన్నేళ్ళ క్రితం 'పట్టపగలు' పేరుతో వర్మ ఓ సినిమాను తెరకెక్కించాడు. 
 
ఇందులో రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, జీవా, బెనర్జీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా పేరును 'ఆర్జీవీ దెయ్యం'గా మార్చి, త్వరలో జనం ముందుకు తీసుకు రాబోతున్నారు వర్మ. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'బాలీవుడ్ లో 'బ్రేకప్' మూవీలో రణధీర్‌కు జోడీగా స్వాతీ దీక్షిత్ నటించింది. ఇప్పుడీ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రను పోషిస్తోంది. పెళ్ళీడుకొచ్చిన కూతురు తండ్రిగా రాజశేఖర్ నటించడమే కాదు మేకప్ లేకుండా రియల్ గెటప్ లో కనిపించబోతున్నారు' అని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న 'ఆర్టీవీ దెయ్యం' ఇదే నెల 16న జనం ముందుకు రాబోతోంది.