మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (17:07 IST)

విడుదలకు సిద్దమైన `Rgv దెయ్యం`

RGV deyyam
నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌ గోపాల్‌వర్మ `రాత్’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ చిత్రాలతో భారతదేశంలో హర్రర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ .మళ్ళీ ఇప్పుడు ‘Rgv దెయ్యం’ అనే కొత్త దెయ్యం కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతుంది.
 
దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..Rgv దెయ్యం సినిమా వెండి తెర ప్రమోషన్స్ మొదలు పెట్టాము.బాలీవుడ్ సినిమా ‘బ్రేకప్’లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురుకు తండ్రిగా రాజశేఖర్ నటించడమే కాక రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో నటిస్తుండటం విశేషం.తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 16 న 5 భాషలలో తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చడంతో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

లైన్ నిర్మాతలు: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె సాయి కార్తీక్ గౌడ్ 
ఎడిటర్: సత్య, అన్వర్ 
డి.ఓ.పి: సతీష్ ముత్యాల
సంగీతం: డిఎస్ఆర్ 
ప్రొడక్షన్ ఇంఛార్జ్: కె రూపేష్
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్