శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (09:23 IST)

పెళ్లి చేసుకోకుండానే మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్

బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్. ఆమె పెళ్ళి చేసుకోకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సెప్టెంబరు 23వ తేదీన ఆమె మగబిడ్డను ప్రసవించింది. ఇంతకీ ఈమె తల్లి అయినప్పటికీ ఇప్పటికీ పెళ్లి కాలేదు. ఇకపై పెళ్ళి చేసుకోనుంది. 
 
తన ప్రియుడు జార్జ్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ వచ్చిన అమీ జాక్సన్... గర్భందాల్చింది. దీంతో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే పెళ్లి మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో తొమ్మిది నెలలు నిండటంతో సెప్టెంబరు 23వ తేదీన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన సంతోషాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. "ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మా ఏంజెల్ ఆండ్రియాకు స్వాగతం" అంటూ తన ఒడిలో ఉన్న కుమారుడిని జార్జ్ ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
 
ఇక ఈ ఏడాది మే లో అమీ - జార్జ్‌ల నిశ్చితార్థం జరిగింది. బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తల్లిదండ్రులు అయ్యాక పెళ్లి చేసుకుంటామని తెలిపారు. మరి ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో లేక ఎప్పటికీ సహజీవనం చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారో వేచిచూడాల్సివుంది.