గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (16:28 IST)

వరుణ్ ధావన్ అంటే పిచ్చి ప్రేమ : అనన్య పాండే

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. ఈమె బాలీవుడ్ నటుడు చుంకీపాండే కుమార్తె. బాలీవుడ్ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైపోయింది. బాలీవుడ్ తెరపై హవా కొనసాగిస్తోన్న యువ కథానాయికలకు గట్టిపోటీ ఇవ్వడానికి అనన్య పాండే రంగంలోకి దిగుతోంది. బాలీవుడ్ కొత్త చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ చిత్రంపై ఆమె స్పందిస్తూ, 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ద్వారా పరిచయమైన వరుణ్ ధావన్ అంటే నాకు అమితమైన ఇష్టం. ఎప్పుడు చూసినా వరుణ్ ధావన్ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. అలాంటి వరుణ్ ధావన్ అంటే నాకు పిచ్చిప్రేమ అని ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల వరుణ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ స్టూడెంట్ .. నువ్వంటే నాకు ఎప్పటికీ ఓ క్రష్' అంటూ ట్వీట్ కూడా చేసింది.