శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 27 ఏప్రియల్ 2019 (21:21 IST)

లవర్స్... చచ్చిపోదామని రైలు పట్టాలపై పడుకున్నారు... వారిలో ఒక్కరు ఎస్కేప్...

హైదరాబాదుకు చెందిన ప్రేమికులు తమ ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరించలేదని, బతకడం వృధా అని భావించారు. కలిసి చనిపోవడమే దీనికి పరిష్కారంగా తలచి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురూ హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరారు. మహరాష్ట్రలోని ఔరంగబాద్‌లో రైలు కింద పడి చనిపోవాలని ప్రణాళిక రచించారు.
 
ఆ ప్రకారం ఇద్దరూ కలసి రైలు పట్టాల మీద పడుకున్నారు. కరెక్టుగా రైలు వచ్చే సమయానికి ప్రియుడు తన మనసు మార్చుకుని పట్టాల మీద నుంచి పక్కకు జరిగిపోయాడు. కానీ ఆమె మాత్రం తప్పుకోలేకపోయింది. దీంతో రైలు కింద పడి ఆ యువతి చనిపోయింది. అమ్మాయి బంధువులు కేసు పెట్టడంతో పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.