దేవుడిచ్చిన బాడీ అందాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాను.. విష్ణుప్రియ
నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇటీవల చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. ఆమె తన బాడీ అందాలపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 'మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా ట్రెడిషనల్‌గా, ఒక మంచి తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారు. కానీ మీ పోస్టులు మాత్రం చాలా హాట్‌గా, బోల్డ్‌గా, అంటే అమ్మాయిలను రెచ్చగొట్టేవిధంగా ఉంటున్నాయి కదా అందుకే మీ కాస్ట్యూమ్స్ గురించి అడుగుతున్నాను' అని యాంకర్ అడిగింది.
దీనిపై నటి, యాంకర్ విష్ణుప్రియ ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరినీ ముక్కున వేలు వేసుకునేలా చేసింది. 'చూడండి.. నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. నాకు మోడలింగ్ ఆఫర్స్ వస్తాయి. ఫోటో షూట్, అపర్చునిటీస్ వస్తాయి. వీటన్నిటికీ నా పోర్ట్‌ఫోలియో రెడీగా ఉండాలి. దానికోసం దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్ ఎంటర్‌టైన్మెంట్ కోసమే వాడుతున్నాను.
అంటే డిఫరెంట్ ఔట్‌ఫిట్స్‌తో నేను ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉన్నానో అంతవరకు, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి ఒక టెంప్లేట్‌లాగా నా బాడీని ఉపయోగిస్తున్నాను అంటూ ఏమాత్రం బిడియం లేకుండా సమాధానమిచ్చారు. పైగా, ఇదంతా నా వర్క్‌లో ఒక భాగం మాత్రమే. కానీ, అది నేను కాదు. నిజ జీవితంలో మీరు అన్నట్టుగా చాలా సంప్రదాయబద్ధంగా ఉండేందుకు ఇష్టపడుతాను అని చెప్పుకొచ్చారు.
