1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (17:32 IST)

నెటిజన్లను షాక్‌కు గురిచేసిన హీరోయిన్

"ప్రేమమ్" చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ గర్భందాల్చింది. ఆమె నిండు గర్భంతో ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
అదేంటి.. అనుపమకు ఇంకా పెళ్లి కాలేదు కాదా.. గర్భం ఎలా వస్తుంది అని ప్రతి ఒక్కరికి సందేహం రావొచ్చు. అయితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల వెనుక ఉన్న అసలు విషయాన్ని ఇపుడు తెలుసుకుందాం. 
 
ఈమె గత 2019లో ఒక మలయాళ చిత్రంలో గర్భవతిగా నటించారు. ఆ సమయంలో దిగిన ఫోటోలను అనుపమ పరమేశ్వరన్ తాజాగా షేర్ చేశారు. ఇంకేముందు ఆ ఫోటోలకు ముందు వెనుక చూడకుండా అందరూ కంగ్రాట్స్ అంటూ ట్వీట్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.