ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (15:18 IST)

భయపెట్టేస్తున్న అనుష్క... (వీడియో)

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సినీ ప్రేక్షకులను భయపెట్టేస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం పరి. ఈ చిత్రం ప్రోసిత్ రాయ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. ఇందులో ప‌రంభ్ర‌త చ‌ట‌ర్జీ, రజ‌త్ క‌పూర్, రిత‌బ్ర‌య్ చ‌క

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సినీ ప్రేక్షకులను భయపెట్టేస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం పరి. ఈ చిత్రం ప్రోసిత్ రాయ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. ఇందులో ప‌రంభ్ర‌త చ‌ట‌ర్జీ, రజ‌త్ క‌పూర్, రిత‌బ్ర‌య్ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య పాత్ర‌లు పోషించారు. వచ్చే నెల రెండో తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. 
 
ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ విడుద‌ల చేస్తూ అంచనాలను పెంచుతోంది. పూర్తి హార్రర్ చిత్రంగా తెరకెక్కిన పరి చిత్రంలో ఎఫెక్ట్స్ ఊహ‌కంద‌ని రీతిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా అనుష్కకి సంబంధించి పోస్ట‌ర్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్స్‌లో మొహంపై నెత్తుటి మ‌ర‌క‌ల‌తో భ‌యంక‌రంగా క‌నిపిస్తుంది. ఎప్పుడు బబ్లీ గర్ల్‌గా, ప్రేమించే పాత్రల్లో కనిపించే అనుష్క‌ ఇందులో మాత్రం ఊహలకు అందని రీతిలో భయపెట్టే అవతారంతో అభిమానుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.