శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (09:27 IST)

బొద్దుగా ఉంటే సినీ అవకాశాలు రావని గ్రహించలేక పోయా: అపర్ణా బాలమురళి

Aparna Balamurali
బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటానని అనుకున్నాననీ, ఇలా ఉంటే సినీ అవకాశాలు రావని గ్రహించలేక పోయినట్టు హీరోయిన్ అపర్ణా బాలమురళి అంటున్నారు. హీరో సూర్య నటించిన తమిళ చిత్రం "సూరరైపోట్రు". తెలుగులో "ఆకాశమే నీ హద్దురా". ఇందులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 
 
అయితే, ఈ మధ్యకాలంలో ఆమె కాస్త లావుగా తయారయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెను పలువురు ట్రోల్ చేస్తున్నారు. వీటిపై స్పందింంచారు. శరీరాకృతికి, ప్రతిభకు ఎలాంటి సంబంధం లేదు. అగ్ర హీరోలుగా ఉన్న ధనుష్, విజయ్ సేతుపతిల క్రేజ్ ముందు వారి రూపం ఏమాత్రం గుర్తుకు రావడం లేదన్నారు. 
 
ముఖ్యంగా, పాపులారిటీకి లుక్స్‌కు లింకు లేదు. అస్సలు నా దృష్టిలో ప్రతిభకు రూపం కొలమానం కాదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, తనకు సినీ అవకాశాలు రాకపోవడానికి కారణం బొద్దుగా ఉండటమేననే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నట్టు అపర్ణా బాలమురళి తెలిపారు.