రియాలిటీ షో లోరామ్‌చ‌ర‌ణ్‌కు వేసే ప్ర‌శ్న‌లు ఈజీగావుంటాయా!

ntr reyaliti show
డీవీ| Last Updated: గురువారం, 22 జులై 2021 (17:48 IST)
reyaliti show
ఎన్‌.టి.ఆర్‌., రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ర‌క‌ర‌కాలుగా చేస్తున్నాడు. పైసా పెట్టుబ‌డి లేకుండా సోష‌ల్ మీడియా ద్వారా ఈజీగా చేసేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ముగింపు ద‌శ‌లో వుంద‌ని తెలుస్తోంది. కాస్త గేప్ దొరికితే ఎన్‌.టి.ఆర్‌. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు.

కాగా, ఈ షోకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త విడుద‌లైంది. తాము చేస్తున్న సినిమాకు సంబంధించిన విధంగా స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15వ తేదీ ఆదివారం నాడు మొదలు కాబోతోందట. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తోంది. అందులో చ‌ర‌ణ్‌ గెలిచే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు విరాళంగా ఇస్తారట. మ‌రి చ‌ర‌ణ్‌కు ఈజీ ప్ర‌శ్న‌లు వుంటాయ‌ని యూనిట్‌లో చ‌ర్చించుకుంటున్నారు. ఎన్టీయార్ ప‌ది కోట్లు పారితోషికం తీసుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో చ‌ర‌ణ్ ఎంత గెలుగుచుకుంటాడో చూడాలి.దీనిపై మరింత చదవండి :