మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 6 మే 2021 (16:44 IST)

అసలు మీరు మనుషులేనా? మీకు దణ్ణం పెడుతున్నా, ప్లీజ్: ఆర్.పి. పట్నాయక్

ప్రస్తుత కోవిడ్ పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. ఈరోజు మాట్లాడిన వ్యక్తి రేపు బతికి ఉంటాడో లేదోనన్న అనుమానం కలుగుతోంది. కోవిడ్ మహమ్మారి విజృంభణ అలాంటిది. అయితే కోవిడ్‌ను నియంత్రించాల్సిన అధికారులు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. 
 
తూతూ మంత్రంగా ప్రభుత్వ అధికారులు కోవిడ్ పైన దృష్టి పెడుతున్నారన్న విమర్సలు లేకపోలేదు. కోవిడ్ పైన ప్రభుత్వ ప్రజాప్రతినిధులను నిలదీసేందుకు ధైర్యం ఎవరికి చాలడం లేదు. సినీ సెలబ్రీటీలైతే ఎవరికి వారు సైలెంట్‌గా ఇళ్ళకే పరిమితమైతే మరికొంతమందికి కోవిడ్ సోకి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ సినీ సంగీత దర్సకుడు, నటుడు ఆర్.పి.పట్నాయక్ రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో మండపడ్డారు. కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ అందడం లేదు. చాలామంది చనిపోతున్నారు. కనీస సౌకర్యాలు ఆసుపత్రుల్లో కరువయ్యాయి.
 
భయానకమైన పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన మీరు ఎన్నికలంటూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేశారు. ఫలితాలు తరువాత సంబరాలు చేసుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా అంటూ రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆర్.పి.పట్నాయక్. 
 
ఎన్నికలపై చూపించిన ఆసక్తి కోవిడ్ పైన ఒక్కశాతం చూపించి ఉంటే ఎంత బావుండేది. కోవిడ్ మరణాల సంఖ్య బాగా తగ్గేది. చాలామంది కోలుకునేవారు. రాజకీయ నాయకులు మీకు దణ్ణం పెట్టి చెబుతున్నా ఇప్పటికైనా కోవిడ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టండి.. కరోనా మరణాల రేటును తగ్గించండి అంటూ ప్రాధేయపడ్డారు ఆర్.పి.పట్నాయక్.