శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:50 IST)

శ్రీదేవి అంటే గౌరవం.. తండ్రి జీవితంలోకి ఎవరొచ్చినా గౌరవిస్తా: అర్జున్ కపూర్

ప్రముఖ నటి శ్రీదేవిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని బోనీ కపూర్ తొలి భార్య కుమారుడు, హీరో అర్జున్ కపూర్ చెప్పాడు. తను హీరోగా ఎదిగినప్పటికీ.. ఎప్పుడూ తన సవతి తల్లితో ఎదురుగా కూర్చుని మాట్లాడిన సందర్భాలు లేవన

ప్రముఖ నటి శ్రీదేవిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని బోనీ కపూర్ తొలి భార్య కుమారుడు, హీరో అర్జున్ కపూర్ చెప్పాడు. తను హీరోగా ఎదిగినప్పటికీ.. ఎప్పుడూ తన సవతి తల్లితో ఎదురుగా కూర్చుని మాట్లాడిన సందర్భాలు లేవని గతంలో చెప్పిన అర్జున్ కపూర్ ప్రస్తుతం.. శ్రీదేవి మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు.
 
శ్రీదేవి అంటే తనకు గౌరవమని.. తన తండ్రి జీవితంలోకి ఎవరు వచ్చినా గౌరవిస్తానని.. అలాగే శ్రీదేవిని కూడా గౌరవిస్తానని అర్జున్ కపూర్ తెలిపాడు. గతంలో శ్రీదేవిని కానీ, ఆమె కుమార్తెలను కానీ తాను కలిసే ప్రసక్తే లేదని చెప్పాడు. కాగా బోనీ కపూర్ తొలి భార్య సంతానానికి, శ్రీదేవికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని వార్తలొచ్చాయి. 
 
తొలి భార్య మోనా కుమారుడు అర్జున్ కపూర్ బోనీకి దగ్గరవుతున్నాడని.. ఈ వ్యవహారంతోనే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారనే వార్తలు వచ్చాయి. ఆస్తి గొడవల వల్లే శ్రీదేవి ఆందోళన చెందిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.