బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (13:48 IST)

అమీర్ ఖాన్ కుమారుడి అర్జున్ రెడ్డి హీరోయిన్ రొమాన్సా..?

అర్జున్ రెడ్డి హీరోయిన్‌కు బాలీవుడ్ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన ఈ భామకు టాలీవుడ్‌లో అంతగా కలిసిరాలేదు.

ఇక ఈ బ్యూటీ హిందీ మూవీ బంఫాడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో ఓ సినిమా కూడా చేస్తోంది. జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో రణ్ వీర్ సింగ్‌తో కలిసి నటిస్తోంది. 
 
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. జనవరిలో చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

ఈ చిత్రంలో షాలినీ పాండే హీరోయిన్‌గా నటించనుందట. మేకర్స్ షాలినీ పాండేను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.